తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు.అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *