తొలి శుభోదయం:-
సింగరాయకొండ మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ సోదరులు, సోదరీమణులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ని కలిసి వినతిపత్రం అందజేశారు.వారు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు మరియు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగులకు అండదండగా ఉంటుంది.
మీరు అడిగినట్లుగానే త్వరలోనే మూడు చక్రాల బ్యాటరీ ట్రైసైకిళ్లు ప్రభుత్వ మార్గంలో అందజేస్తాము.
ఇళ్ల స్థలాల విషయమై పై స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి,
చర్చలు పూర్తయిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాము,అని హామీ ఇచ్చారు.అదేవిధంగా, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు సన్నెబోయిన నాగేశ్వరరావుతో కరచాలనం చేస్తూ,
“దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుంది” అని మంత్రి తెలిపారు.