తొలి శుభోదయం:-
సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,
సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ని ఆయన నివాస గృహం నాయుడు పాలెంలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి నూతన కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులను మంత్రివర్యులకు పరిచయం చేశారు.సింగరాయకొండలో నూతన కోర్టు ఏర్పాటు కోసం సహకరించినందుకు మంత్రి కి న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి పుష్పగుచ్చం మరియు శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బక్కమంతుల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ పాలవెల్లి సంజీవ రెడ్డి,
సీనియర్ న్యాయవాదులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, కె. హరి కోటేశ్వరరావు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.