సింగరాయకొండ పాకల బీచ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు…
బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు అందజేత
తొలి శుభోదయం ప్రకాశం :-
మొంథా తుఫాను దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు సోమవారం సింగరాయకొండ పాకల బీచ్, పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. బే వాచ్ టవర్ ద్వారా సముద్ర స్థితిని పరిశీలించిన ఎస్పీ గారు, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు తెలియచేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టగా, జిల్లా పోలీస్ శాఖ కూడా పూర్తి సన్నద్ధతలో ఉందని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే సుమారు 20 రెవిన్యూ గ్రామాలను గుర్తించామని, అక్కడ స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఇతర సబ్‌డివిజన్ల నుండి అదనపు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. తుఫాను సమయంలో చెట్లు విరిగిపోవటం, నీరు నిల్వలు ఏర్పడే ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు జెసిపీలు, ట్రాక్టర్లు, క్రేన్‌లు, డోజర్లు, రోపులు, కట్టర్లు, అలాగే రూప్స్, డ్రాగన్ లైట్స్ వంటి అత్యవసర పరికరాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. సముద్ర తీర గ్రామాల సర్పంచులతో పాటు ప్రజలు మాట్లాడి, వారిని సమన్వయం చేసుకుంటూ, అవసరమైతే గజ ఈతకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారు, అధికారులు ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాలకు వెంటనే వెళ్లాలని సూచించారు. జిల్లా ఎస్పీ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ, తుఫాను సమయంలో ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించి సహాయం అందిస్తుందన్నారు.జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో స్ధానిక పోలీసులకు, డయల్ 112, పోలీస్ వాట్సప్ నెంబర్ 9121102266 సమాచారం అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ గారి ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, కనిగిరి సిఐ ఖాజావలి, ఎస్సై మహేంద్రా, టంగుటూరు ఎస్సై నాగమలేశ్వరరావు, మెరైన్ ఎస్సై ఈశ్వరయ్య, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు.
