తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించిన జిల్లా అధికారులు

తొలి శుభోదయం ప్రకాశం :-

తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావంతో నీట మునిగిన నేపథ్యంలో ఒంగోలు సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా చేరి, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC) ప్రాంగణంలో కూడా నీరు ప్రవహించిన పరిస్థితిని జిల్లా అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, IPS గారు, PTC ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి రాధిక, IPS గారు, ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, ఓడా చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, మేయర్ శ్రీమతి సుజాత గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర రావు గారు ప్రత్యక్షంగా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు.నీరు ఎలా బయటకు పంపించాలనే అంశంపై సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాటర్ ఎక్కడకు అవుట్ ఫ్లాలో అవుతుందనే.. దానిపై ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగినది.అంతే కాకుండా పిటిసిలోకి కుడా వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రధాన డ్రైనేజి నుండి వాటర్ అవుట్ ఫ్లో పై మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్చించడం జరిగింది.వేంటనే స్ధానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులందరూ సమన్వయంతో వర్మ హోటల్ సమీపంలో ఉన్న డివైడర్ ను బద్దలు కొట్టి వాటర్ ను పోతురాజు మేజర్‌ కాలువలోకి మళ్ళించడం జరిగినది.ఇలా చేయడం ద్వారా సుజాత, సమతా నగర్లలో నిలువ ఉన్న వాటర్ అవుట్ ప్లోను తొలగించడం జరిగిందన్నారు.ప్రజల భద్రత, ప్రజా సౌకర్యం దృష్ట్యా తక్షణం అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు సూచించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గేవరకు అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తారు.జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు తుఫాన్ సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మరియు పోలీస్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను వెంటనే సమాచారం తెలియజేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *