తొలి శుభోదయం సింగరాయకొండ:-
తుఫాన్ ప్రభావంతో సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో టి.పి. నగర్‌లోని అప్పాపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సింగరాయకొండ ఎమ్మార్వో నున్న రాజేష్ , పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ , రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ కాశీ కాకర్ల పాల్గొన్నారు. అదనంగా గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీలం సుబ్రహ్మణ్యం (చంటి), పంచాయతీ రేషన్ షాప్ నం.10, నం.11 డీలర్లు, 245 బూత్ కన్వీనర్ షేక్ ఫాజిల్, 243 బూత్ కన్వీనర్ మసనం రాజగోపాల్, కొండేపి నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, రేషన్ డీలర్ గంధం సుధీర్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.తుఫాన్ ప్రభావిత ప్రజలకు ఆహారం, తాగునీరు వంటి అవసరమైన సదుపాయాలు అందించడంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు చురుకుగా వ్యవహరించారు. పంచాయతీ అధికారులు బాధితులకు సహాయం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు.