తొలి శుభోదయం :సింగరాయకొండ
ఇల్లు కుటుంబం గురించి పట్టదు ప్రభుత్వ ఆదేశాలు అధికారుల మార్గదర్శనం ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణ ప్రకృతి వైపరీత్యాలలో ప్రజా రక్షణ ప్రాణ ఆస్తి పరిరక్షణే దేశంగా పనిచేసే రక్షక భట నిలయానికి రక్షణ లేకుండా పోయింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఇది. 16 వ జాతీయ రహదారి పై ఉన్న రైల్వే స్టేషన్ కూడలి గ్రామం లో ఎంతో పురాతన మయినది ఈ రక్షక భట నిలయం. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ఏ శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ప్రజారక్షణ బాధ్యతలు నిర్వహించే సిబ్బంది దాని లోనే తల దాచుకుంటూ భయం గుప్పిట్లో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఇంత కాలం రక్షక భట నిలయం లో భవనం పరిస్థితి, ప్రాంగణం పరిస్థితి ఎవరికి తెలియదు. రక్షక భట నిలయం గదా ఏమంటే ఎవరికి కోపం వస్తుందో అని ప్రజలు కూడా దాన్ని ప్రస్తావించేవారు కాదు. కానీ మంగళవారం మొద తుఫాను ప్రభావం కారణంగా ప్రభుత్వ, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాలతో తీర ప్రాంత గ్రామాలలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టానికి తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వచ్చిన ఆదేశాలతో సింగరాయకొండ పోలీస్ లు సర్వసన్నద్ధంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని ప్రజల రక్షణే ప్రధానంగా విధులు నిర్వహించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇంతలో సింగరాయకొండ నుండి ఒంగోలు వైపు వెళ్ళే మార్గం లో రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు పడి పోయిన సమాచారంతో పోలీస్ లు అక్కడ చెట్టు తొలగించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఊళ్ల పాలెం రోడ్డు లో రోడ్డుకి ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి అడ్డంగా పడి పోవడం తో హుటాహుటీన పోలీస్ స్టేషన్ లో ముందు జాగ్రత్యగా సిద్ధంగా ఉంచిన జె సి బి ల సహాయంతో వెంటనే వాటిని తొలిగించి రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే సామాజిక సేవ సరే తమ రక్షక భట నిలయం గురించి మాత్రం ఆదమరిచారు. ఈ రోజు కురిసిన వర్షానికి రక్షక భట నిలయం ప్రాంగణం జలమయం అయింది. ట్రంక్ రోడ్డు నుండి రక్షక భట నిలయం లోనికి వెళ్లాలంటే అడుగు అడుగున్నర పైనే నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చూసిన జర్నలిస్ట్ లకు మనసు చివుక్కన్నది. అందరి క్షేమం, రక్షణ, భద్రత గురించి ఆలోచించి ఇల్లు, వాకిలి కుటుంబం గురించి కాకుండా ప్రజా రక్షణే ప్రధానంగా సేవలు అందించే రక్షక భటుల రక్షణ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షక భట నిలయం లోనికి వెళ్లాలంటే భయం ఎప్పుడు ఏమి జరగ తుందో అని బిక్కు.బిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిందే. నిరంతరం ప్రజా రక్షణకొరకు సేవలు అందించే రక్షక భటుల రక్షణ కి ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ప్రజలు, జర్నలిస్ట్ లు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
