తొలి శుభోదయం సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో అధికారుల నిర్లక్ష్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పునరావాస కేంద్రాలను పరిశీలించి అన్నారు.పునరావాస కేంద్రాలలో 38 మంది ఉండగా వారికి మంచినీళ్లు , దుప్పట్లు ఇప్పటివరకు అందజేయలేదని ప్రభుత్వం గొప్పగా మేమంతా ముందే ఏర్పాటు చేశామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు.పాకల తీర ప్రాంత మత్స్యకార గ్రామాలలో గత పది రోజుల నుంచి ఎవరిని వేటకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ వెళితే బోట్లు, వలలు సీజ్ చేస్తామని అధికారులు బెదిరించారని వారికి తినటానికి ముందుగా కనీసం రేషన్ సరుకులు కూడా ఇవ్వలేదని వారి బాధ ఎవరు వింటారని బాధితుల తరఫున ఆయన అసహనం వ్యక్తం చేశారు.అధికారులతో ఫోన్ లో మాట్లాడి వారికి తక్షణం కావలసిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
