తొలి శుభోదయం:-
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.అజయ్ కుమార్ మంగళవారం పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని రికార్డులు, UI ఫైల్స్, CD ఫైల్స్‌ను శ్రద్ధగా పరిశీలించి, నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ పుల్లలచెరువు తో మరియు స్టేషన్ సిబ్బందితో సమావేశమై, స్టేషన్లో జరుగుతున్న పరిపాలనా పనితీరు, కేసుల విచారణ నాణ్యత, ప్రజా సేవా విధానంపై వివరణాత్మకంగా చర్చించారు.
ప్రజలకు వేగవంతంగా సేవలందించడం, చట్ట పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం, గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడడంలో ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే రికార్డులు పద్ధతిగా నిర్వహించాలి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి, స్టేషన్ పరిధిలో నేరాల నివారణకు సాంకేతిక పద్ధతులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
జనహితాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.