తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు మరియు పోలీస్ అధికారులు ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ మాట్లాడుతూ మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా వారం రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కొరత లేకుండా ఉండేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో, అలాగే మహిళలకు ప్రసవ సమయాల్లో రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని, ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని GGH బ్లడ్ బ్యాంక్‌కు రక్తాన్ని అందజేస్తున్నామని వివరించారు. పోలీస్ శాఖ పిలుపు మేరకు క్విజ్ కాలేజ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి మహిళ తగినంత శ్రద్ధ వహించాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని, క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు తాలూకా సిఐ టి.విజయ్ కృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ యు.సుధాకర్, డాక్టర్ అశ్విని, సిబ్బంది, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *