తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, జిల్లాలోని ముఖ్యమైన ఆలయాలు, బీచ్‌లు, నదులు, చెరువుల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి, దీపాలంకరణలు చేయడానికి, ఆలయ దర్శనానికి పెద్ద ఎత్తున వచ్చే నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు.ప్రతి బీచ్ మరియు స్నాన ఘాట్ వద్ద సెక్యూరిటీ విభజన చేసి, రోప్స్, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లను ఏర్పాటు చేశారు.సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పరిస్థితులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు మార్గదర్శక సూచనలు చేస్తున్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలు శాంతియుతంగా, భద్రంగా పండుగను జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకున్నారు.“ప్రజల భద్రత – మా ప్రాధాన్యత” అని జిల్లా పోలీసులు తెలిపారు.