తొలి శుభోదయం:-
మండల కేంద్రమైన మర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా హెచ్ఎం రెబ్బ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు,అక్రమ రవాణాలపై అవగాహన కలిగించారు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా ఈకార్యక్రమం జరగడం అభినందనీయమని వెంకటేశ్వర్లు కొనియాడారు, అనంతరం లైంగిక దాడులు, అక్రమ రవాణాపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు,ఈ పోటీలలో గెలుపొందిన మొదటి, రెండవ బహుమతులు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు కె.పి హైమావతి, ఏ, సుధేష్ణ,ప్రభావతి, కేజీయమ్మ, గ్రేసమ్మ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.