తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో నిన్న నిర్వహించిన AI & Robotics Innovation Competitionsలో దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ఇందులో ఈరోజు జరగబోయే ఫైనల్ రౌండ్‌కు కేవలం 18 ప్రాజెక్టులు మాత్రమే ఎంపికయ్యాయి.ఆ ఎంపికైన ప్రాజెక్టులలో సింగరాయకొండ గీతం స్కూల్ నుండి వచ్చిన ప్రాజెక్టులలో — Agri Intelligence మరియు Humanoid Robot — ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడం విశేషం. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక పాఠశాలగా గీతం స్కూల్ నిలవడం మరింత గర్వకారణం.గ్రామీణ ప్రాంతమైన సింగరాయకొండ నుంచి వచ్చిన విద్యార్థులు, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదిక అయిన IIT Delhiలో తమ ప్రతిభను చాటుతూ ఫైనల్ రౌండ్‌కు చేరుకోవడం వారి ప్రతిభకు నిదర్శనం. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, వారికి మార్గనిర్దేశం చేసిన ట్రైనర్స్ మరియు సహకరించిన అందరికీ గీతం యాజమాన్యం తరఫున హృదయపూర్వక అభినందనలు.
నేడు జరగబోయే ఫైనల్ రౌండ్లో కూడా సింగరాయకొండ విద్యార్థులు విజయం సాధించి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.