తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేశారు.జాతీయ రహదారి NH-16 వైపు చేరుకునే ముఖ్యమైన అప్రోచ్ రోడ్ల వద్ద వాహనాల వేగ నియంత్రణకు మరియు ప్రమాదాల నివారణకు స్టాపర్ డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్యల ద్వారా వాహనదారులు ముందుగానే అప్రమత్తమై, నెమ్మదిగా ప్రయాణించేలా చేయడం ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రమ్ములు వంటి భౌతిక నియంత్రణ చర్యలు ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.ఈ రోడ్డు భద్రత కార్యక్రమం ద్వారా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు.