తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు NH-544D రహదారిపై రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మరియు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పెద్దారవీడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం, అతి వేగం వల్ల జరిగే ప్రమాదాలు, తప్పు దారిలో డ్రైవింగ్ చేయకూడదనే అంశాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన కల్పించారు.హెల్మెట్ ధరించకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, నిబంధనల ప్రకారం చలాన్లు విధించడం జరిగింది. అలాగే ప్రజలతో రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *