తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణంలోని మోడంపల్లె లే అవుట్ ప్రక్కన NTR కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా గిద్దలూరు పట్టణంలోని నూతన గృహ నిర్మాణం లో భాగంగా కొత్త లక్ష్మీ దేవి & సుబ్బరత్నం దంపతులకు నూతన గృహ మంజూరు అయిన సందర్భంగా గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి , పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే , మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఇళ్లు లేని వారికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అండగా ఉంటుందని పేదలకు కూడు – గుడ్డ అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా సాగుతోందని రాబోవు రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, పురపాలక సంఘం అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,పాలుగుళ్ల ప్రతాప్ రెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాస్ రెడ్డి,కడియం శేషగిరి, కౌన్సిలర్ లు లొక్కు రమేష్, దెమా నర్సింహులు, స్థానిక నాయకులు తదితరులు గృహ ప్రవేశం వేడుకలో పాల్గొన్నారు…..