తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా “Sky Eye Prakasam” ప్రాజెక్ట్ ద్వారా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా విస్తృత నిఘా ఏర్పాటు చేశారు.ఈ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా గ్రామ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నేరాలను అరికట్టేందుకు ఈ ఆధునిక పద్ధతి ఎంతో ఉపయోగకరంగా మారింది.పోలీసులు తెలిపిన ప్రకారం, ఈ విధమైన గగన నిఘా వల్ల నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా భావన మరింత పెరుగుతోంది. గ్రామ సరిహద్దుల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది.ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా “స్కై Eye ప్రకాశం ” ప్రాజెక్ట్‌ను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *