తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు చట్టసువ్యవస్థ పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, Sky Eye Prakasam Project లో భాగంగా అద్దంకి పట్టణ సీఐ ఆధ్వర్యంలో బొల్లపల్లి టోల్ గేట్ వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. Sky Eye Prakasam Project ద్వారా డ్రోన్ సహాయంతో రియల్ టైమ్‌లో ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నారు.వాహన తనిఖీలలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు తదితర వాహనాలను పరిశీలించి, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, చట్టవిరుద్ధ రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ Sky Eye Prakasam Project ద్వారా నిఘా చర్యలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *