అధినేతలతో ఆత్మీయ విందులో పాల్గొనే అవకాశం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కండ్రా మాల్యాద్రికి ప్రత్యేకగుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో…పార్టీ ఆవిర్భావం నుంచి విశిష్ట సేవలు అందించిన 44 మందిని ఎంపిక చేసి… విజయవాడలో ఆదివారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. వారిలో కండ్రా మాల్యాద్రికి కూడా ఒకరు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసంలో మాల్యాద్రికి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహంతోపాటు మంగళగిరి చేనేత వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అందజేశారు. వారిద్దరూ 44 మందితో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. మాల్యాద్రి గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, రెండుసార్లు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా కండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ పార్టీలో సీనియర్ల సేవలను గుర్తించి సత్కరించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.