తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని 31 మరియు 32 వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను…. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , టిడిపి కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, 31 వ వార్డు టిడిపి అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ, 32వ వార్డు టిడిపి అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ పార్టీ నాయకులు బెజవాడ ప్రసాద్, ముప్పవరపు వేణు, గుర్రం మధు, భవనాసి వెంకటేశ్వర్లు, గుమ్మ శివ, నాదెండ్ల మధు, పులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *