తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.17,740/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.అక్రమ జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *