తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు పోలీస్ సిబ్బందికి సీపీఆర్‌ (CPR – Cardio Pulmonary Resuscitation) పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య పాల్గొని, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన లేదా సహాయం అవసరమైన వ్యక్తులకు సీపీఆర్‌ను ఎలా అందించాలి అనే అంశంపై సవివరంగా వివరించారు.అలాగే ప్రాక్టికల్‌గా సీపీఆర్ విధానాన్ని ప్రదర్శించి చూపుతూ, హృదయ స్పందన ఆగిన సందర్భాల్లో, శ్వాస ఆగిపోయిన పరిస్థితుల్లో వెంటనే చేపట్టాల్సిన ప్రాథమిక చికిత్స చర్యలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఎంతో కీలకమని, ప్రతి పోలీస్ సిబ్బంది సీపీఆర్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *