తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బిజెపి నాయకుడు ఆకుమల్ల కోటేశ్వరరావు కుమార్తె ఆకుమల్ల గాయని మరియు మాచనూరి సాయి కృష్ణ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ రిసెప్షన్ వేడుకకు గిద్దలూరు బిజెపి పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు బిజెపి నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వధూవరులు ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.