తొలి శుభోదయం ప్రకాశం:-

కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈతముక్కల గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై కొత్తపట్నం ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 4 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,510/- నగదును స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొణిజేడు గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో నిర్వహిస్తున్న అక్రమ కోడిపందేలపై టంగుటూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో దాడి చేపట్టారు. ఈ దాడిలో 2 మందిని పట్టుకొని, 1 కోడి మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, కోడిపందేలు వంటి అక్రమ కార్యకలాపాల వల్ల ప్రజా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *