తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
క్రైస్తవుల అత్యంత పవిత్ర పునరునత్థా ఆదివారం ఈస్టర్ శుభాకాంక్షలను వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా.మధుసూదన్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మానవాళి పాప విమోచన కోసం ఏసుక్రీస్తు మరణంపై సాధించిన విజయానికి మరియు నిత్య జీవనానికి నిదర్శనముగా ఈస్టర్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సోదరులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభువైన ఏసుక్రీస్తు చూపిన ప్రేమ,దయ,కరుణ అందరి కుటుంబాలపై ప్రసరించాలని ఏసుక్రీస్తు పునరుత్థాన ఈస్టర్ పండుగను సుఖ,సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. 40 రోజుల ఉపవాసం, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు అనంతరం జరుపుకొనే ఈస్టర్ చర్చిలలో జరుగు ప్రత్యేక ప్రార్థనలో గడపాలని కోరుకున్నారు.