తొలి శుభోదయం కందుకూరు:-
వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నం లక్ష్మీనరసింహం అనారోగ్యంతో మృతి చెందారు..
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పోకూరులోని వారి స్వగృహంలో లక్ష్మీనరసింహం భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుమారులు వీరాస్వామి, శరత్ లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, సోమినేని తిరుమల, గురజాల బెంజిమెన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..