వసతులపై విద్యార్థినులతో ముచ్చటించిన ఎమ్మెల్యే
ఇంటూరికి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు

తొలి శుభోదయం ఉలవపాడు:-
ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థినుల హాస్టల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దగా… కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. అన్ని వసతులతో హాస్టల్ భవనాన్ని నిర్మించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్కూలు విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాబోధన, మెనూ ప్రకారం భోజనం, హాస్టల్ లో ఇతర వసతులు ఎలా ఉన్నాయో విచారించారు. చక్కగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని బాలికలకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు . నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. విద్యార్థుల్లో పరిజ్ఞానం పెంచడం, ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించడం, పాఠశాలలో వసతులు కల్పించడం లాంటి అంశాలపై లోకేష్ ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని గమనించి విద్యా బోధన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి సురేష్ బాబు ఎంఈఓలు పి.వి రత్నం వెంకటరమణయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ వెంకట సుధారాణి మోడల్ స్కూల్ చైర్మన్ తాటితోటి ప్రభాకర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షులు లక్కంరాజు నరేష్ పార్టీ నాయకులు కే ఆదినారాయణ రాజు, జి సత్య ప్రభాకర్, ఎం ప్రభాకర్ రావు, ఎం గురవయ్య, డి నరసింహం, నతానియల్ పోలుబోయిన శ్రీనివాసులు, రావిపాటి మహేశ్వరరావు, చింతల సింగయ్య, తొట్టెంపూడి మాల్యాద్రి, మరియు మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధం సంఘాల సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు..
