తొలి శుభోదయం :-

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల ప్రజలకు శుభవార్త. మంగళవారం నుండి ఉలవపాడు నుండి విజయవాడ, నెల్లూరు మార్గాలకు సూపర్ లగ్జరీ ఏపీఎస్ ఆర్‌టీసీ బస్సులు నడవనున్నాయి.ఇటీవల నెల్లూరు జోనల్ చైర్మన్ శ్రీ సురేష్ రెడ్డి ఉలవపాడు బస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి ప్రజల ప్రయాణ సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన బీజేపీ తరపున జోనల్ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా, స్థానిక బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు కలిసి ఉలవపాడు బస్ స్టేషన్ పరిస్థితులను చూపించారు.తదనంతరం జరిగిన బోర్డు మీటింగ్‌లో సురేష్ రెడ్డి ఉలవపాడుకు సూపర్ లగ్జరీ బస్సుల స్టాపింగ్ మంజూరు చేయాలని సూచించారు.మంగళవారం నుంచే బస్సులు నడవడం ప్రారంభించగా, వాటి రాకపోకలు సక్రమంగా సాగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పాత బస్ స్టాండ్‌లో కంట్రోలర్‌ను కూడా నియమించారు.ఉలవపాడు ప్రజలు సురేష్ రెడ్డి చొరవకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రయాణికుల సౌకర్యం పెరగడంపై ఆనందం వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *