తొలి శుభోదయం సింగరాయకొండ :-

సింగరాయకొండ మండలం గవదగట్లవారిపాలెం ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలను (TaRL) తరల్ జిల్లా సమన్వయకర్త చుండూరి కిషోర్ బాబు మరియు మండల విద్యాధికారి–2 ఆవుల శ్రీనివాస్(MEO–2) సింగరాయకొండ గారు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న FLN (Foundational Literacy & Numeracy) 75 రోజుల కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.ఈ పరిశీలనలో భాగంగా ఉపాధ్యాయులతో చర్చించి, బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యాస స్థాయి, రోజువారీ కార్యాచరణపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమై చదవడం, వ్రాయడం, లెక్కలపై ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు.FLN కార్యక్రమం ద్వారా విద్యార్థుల మౌలిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాఠశాల ఉపాధ్యాయులు చూపుతున్న కృషిని అధికారులు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మరింత మెరుగుపడేలా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,ఉపాధ్యాయులు అజయ్ కుమార్,సి ఆర్ పి వంశీ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *