తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా సిఐ గారు, పోలీసు సిబ్బంది, తమ పోలీస్ లిమిట్స్‌లోని హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు. విద్యార్థులకు వ్యక్తిగత భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, సామాజిక బాధ్యత, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు వంటి అంశాలపై విస్తృతంగా కౌన్సెలింగ్ అందించారు.పోలీసు అధికారులు విద్యార్థులకు క్రమశిక్షణ, సమాజ పట్ల బాధ్యత, ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే పోలీసులను సంప్రదించాలి అనే విషయాలు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొని తమ సందేహాలను అడిగి స్పష్టత పొందారు.