తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివప్రసాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఆటో యూనియన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద తరచుగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు బ్లాకేజ్ మరియు ప్రయాణికుల రాకపోకలకు కలిగే అంతరాయం గురించి వివరంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు నిర్దేశిత ప్రదేశాల్లోనే ఆటోలను నిలుపుకోవాలని, రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని ఆర్‌ఎస్‌ఐ సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, రైల్వే స్టేషన్ ప్రాంతం ఎప్పుడూ క్రమబద్ధంగా ఉండేలా అందరూ సహకరించాలని తెలిపారు.ఈ సమావేశంలో RPF సిబ్బంది కూడా పాల్గొని ట్రాఫిక్ నిర్వహణలో సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల భద్రత మరియు సౌకర్యం కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *