తొలి శుభోదయం ప్రకాశం:-

అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దర్యాప్తు చర్యల్లో భాగంగా, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు పర్యవేక్షణలో, పోలీసులు సీతారాంపురం ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న జూదంపై ఆకస్మిక దాడులు చేశారు.దాడి సమయంలో అక్రమ గ్యాంబ్లింగ్‌లో నిమగ్నమైన 3 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి ₹4,880 నగదు మరియు జూదానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు.
సీఐ నాగరాజు మాట్లాడుతూ—
జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని, ప్రజలకు నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఎవరు ఇలాంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించిన లేదా పాల్గొన్న సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి దాడులు నిరంతరంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *