తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ఓపెన్ బూజింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ బూజింగ్ జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఆకస్మిక రైడ్లు నిర్వహిస్తూ, అలాంటి స్థావరాలను శుభ్రం చేసి తొలగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *