తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలలో, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తూ ఓవర్‌లోడెడ్‌గా ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డ్రైవర్‌కు మరియు ప్రయాణికులకు కంభం ఎస్సై ప్రత్యేక కౌన్సెలింగ్ అందించారు. అధిక ప్రయాణికులతో వాహనంలో ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తుందని, ఇటువంటి నిర్లక్ష్యాలు ప్రాణాంతకమవుతాయని వివరించారు.ప్రయాణికులు ఓవర్‌లోడెడ్ వాహనాలలో ఎక్కకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఇలాంటి వాహనాలను గమనించిన పౌరులు వెంటనే Dial 100 లేదా ప్రకాశం పోలీస్ వాట్సాప్ నంబర్ 91211 02266‌కు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల రోడ్డు భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *