తొలి శుభోదయం న్యూస్ కృష్ణా / పెనుగ్రంచిపోలు:-

పెనుగ్రంచిపోలు మండలం లింగగూడెంలో కంటి చూపు సరిగా లేని 130 మందికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం కళ్ళద్దాలు పంపిణీ చేశారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఉచితంగా మంత్రి కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో టీడీ జనార్దన్ సొంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. జయప్రద ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా మెడికల్ క్యాంపులు, ,కంటి చూపు సరిగా లేని వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు , విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందిస్తున్నారు. మహిళల్లో కాన్సర్ ని గుర్తించేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇదే స్పూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *