తొలి శుభోదయం కందుకూరు:-

రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వైద్య పరికరాల బహుకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా, కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి తన వంతు సహకారంగా మరో రూ.50,000 విరాళాన్ని ప్రకటించిన స్కందపురి ఎన్టీఆర్ విగ్రహ కమిటీ కన్వీనరు. కందుకూరు పట్టణ మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఏరియా వైద్యశాల చైర్మన్ శ్రీ పిడికిటి వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు పిలుపుమేరకు శాలువాలు, బొకేలు బదులుగా ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఇచ్చిన సూచన మేరకు, జనవరి 1వ తేదీన కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రూ.55,000 నగదును. శ్రీ పిడికిటి వెంకటేశ్వర్లు అందజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *