శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా ఎస్పీ
నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి.
సాంకేతిక టెక్నాలజీ పై అవగాహన పెంచుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలి: జిల్లా ఎస్పీ
విధి నిర్వహణలో అలసత్వం వహించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ గారు కందుకూరు సబ్ – డివిజన్లోని వలేటివారిపాలెం, లింగసముద్రం,కందుకూరు టౌన్, కందుకూరు రూరల్, గుడ్లూరు పోలీస్ స్టేషన్ లను, గుడ్లూరు సర్కిల్ కార్యాలయం మరియు కందుకూరు సబ్ డివిజన్ కార్యాలయమును సందర్శించి, స్టేషన్ స్థితిగతులు మరియు సిబ్బంది పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణం, వివిధ గదులు, మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్ కౌంటర్తో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైల్స్ సహా పలు రికార్డులను తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, నేర నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అలాగే పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులను పరిశీలించి, వాటి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు.ప్రతి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీ.డి. ఫైల్లో సక్రమంగా నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగేలా, దర్యాప్తు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాలప్రకారం రిజిస్టర్ లను కూడా కొత్త ప్రోపార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించకుండా, వాటిపై విచారణ వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలి. శక్తి టీములు, మహిళా పోలీస్లు, డ్వాక్రా మహిళలు సమన్వయంతో మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు, రక్షణ చట్టాలు, శక్తి యాప్ గురించి వివరించాలని, శక్తి టీమ్ సభ్యులు, గ్రామ పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహిళాలు, పిల్లలు భద్రతాకు శక్తి టీములు సమర్ధవంతంగా విధులు నిర్వహించే విధంగా మరియు సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతూ నిరంతరం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను బ్లాక్ స్పార్ట్స్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్స్, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్ములు ఏర్పాటుచేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వాహనాలు నడిపిటప్పుడు తనపై ఒక కుటుంబం ఆధారపడి ఉండుందని గుర్తుచేస్తుకోవాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తగి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతపై అవగాహనా పెంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రకారం వాహనాలు నడపటంతోపాటు ప్రజలలో మార్పు వచ్చినపుడు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అవసరమైన తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారు అధికారులకు సూచించారు. అలాగే ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడం ద్వారా నేరాల శాతం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు కందుకూరు టౌన్ పరిధిలో 16 బహిరంగ ప్రదేశాలను పోలీసు, స్ధానిక ప్రజలు శుభ్రం చేసినట్లు తెలిపారు. కేసుల దర్యాప్తులో సిబ్బందిని కూడా భాగస్వాములను చేసి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పాత నేరస్థులు, అనుమానితులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి జీవన విధానం తదితర విషయాలను తెలుసుకోవాలని, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక/చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ప్రతిరోజు పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను క్రింది స్థాయి సిబ్బందికి సమర్థంగా తెలియజేయాలని, ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు గ్రామా/వార్డులకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట కందుకూరు డిఎస్పీ CH.బాలసుబ్రమణ్యం, గుడ్లూరు సీఐ జి.మంగారావు, కందుకూరు సీఐ SK.అన్వర్ బాషా, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, సబ్ డివిజన్ ఎస్సై లు మరిది నాయుడు, శివ నాగరాజు, బాలకృష్ణ మరియు జి.మంగారావు మరియు సిబ్బంది ఉన్నారు.
