22.5 లక్షలతో 3 రోడ్ల నిర్మాణం
ప్రకాశం కాలనీ, రెవిన్యూ కాలనీ వాసులకు తీరనున్న కష్టాలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని 9వ వార్డు ప్రకాశం కాలనీ మరియు రెవెన్యూ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గారు బుధవారం శంకుస్థాపన చేశారు. 22.5 లక్షల రూపాయల SC సబ్ ప్లాన్ నిధులతో 3 రోడ్లు నిర్మించనున్నారు. తమకు రోడ్డు కష్టాలు తీరబోతున్నాయని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ… వారంతా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ఈ 20 నెలల కాలంలో మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సరికొత్త హంగులతో డివైడర్, సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరు వచ్చినప్పుడు… పట్టణ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించడం, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ డబ్బులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. సిసి రోడ్ల నిర్మాణం క్వాలిటీగా చేపట్టి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, పట్టణప్రధాన కార్యదర్శి షేక్ సలాం, స్థానిక నాయకులు వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, వార్డు అధ్యక్షులు పర్సు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చదలవాడ ఇమ్మానియేలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీను, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, వడ్డెళ్ళ రవిచంద్ర, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సవిడిబోయిన కృష్ణ, మాజీ కౌన్సిలర్ కొచ్చర్ల శ్రీను, చుండూరి శ్రీను, జియావుద్దీన్, కోట కిషోర్, మురారిశెట్టి సుధీర్, రాయపాటి శ్రీను, అన్ని వార్డుల అధ్యక్షులు పాల్గొన్నారు.
