తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

కనిగిరి పట్టణ పరిధిలోని కొత్తూరులో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పీసీ పల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 30,060/- నగదును మరియు పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *