తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:-
దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త రామడుగు గురుబ్రహ్మచారి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదకరం. ఈ నేపథ్యంలో, దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గురుబ్రహ్మచారి గారి నివాసానికి వెళ్లి, ఆయన భార్య శ్రీమతి రామడుగు పుల్లమ్మ గారిని పరామర్శించారు.ఈ సందర్భంగా, టిడిపి కేంద్ర కార్యాలయం ద్వారా మంజూరు చేయబడిన ₹5 లక్షల ప్రమాద భీమా చెక్కును ఆమెకు అందజేశారు. ఈ కష్ట సమయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు , దొనకొండ మండల మాజీ టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వర రావు, గ్రామ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.తమ కుటుంబానికి అండగా నిలిచిన డా. గొట్టిపాటి లక్ష్మీ కి గురుబ్రహ్మచారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.