తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7,358 కోట్ల మరియు గతంలో 11వేల కోట్లు బకాయిలు చెల్లించడం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల ధన్యవాదములు తెలియజేసారు .రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ క్రింద తెలిపిన సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరించాలని కోరారు.2003 డీఎస్సీకి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని,అర్హత కలిగిన సీనియర్ అసిస్టెంట్లకు తగిన పదోన్నతులు కల్పించాలని,పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి, పని భారం తగ్గించాలని,
హై స్కూల్స్‌ను బలోపేతం చేసి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని,12వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసి, ఇంటరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించాలనీ కోరారు.
మంత్రిగారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఉద్యోగుల పక్షపాతిగా అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర బాధ్యులు ఆకు రాతి బలరాం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.