తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో రౌడీ షీటర్లపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రౌడీ షీటర్ల ప్రస్తుత పరిస్థితి, వారి కదలికలు, గత నేర చరిత్రపై సమగ్రంగా చర్చించారు.సీఐ రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.అలాగే, సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా ఉంచేందుకు పట్రోలింగ్, బీట్ డ్యూటీలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్ఐలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *