తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

కొండేపి సర్కిల్ కార్యాలయంలో సీఐ గారి ఆధ్వర్యంలో ఎస్సైలు మరియు సిబ్బందితో క్రైమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో పరిధిలోని వివిధ కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ప్రత్యేకంగా కేసు డైరీ (CD) ఫైల్స్‌ను సీఐ పరిశీలిస్తూ, దర్యాప్తు విధానం, సాక్ష్యాల సేకరణ, కేసుల త్వరితగతిన పరిష్కారం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యమైన దర్యాప్తుతో నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. నేర నియంత్రణలో అప్రమత్తంగా ఉండి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *