తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా, కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించబడినాయి. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుండి రూ.7,100/- నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడిని SI DTF PKM ఆధ్వర్యంలో నిర్వహించగా, అక్రమ కార్యకలాపాలపై శూన్య సహనం విధానంతో చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో శాంతి భద్రతలను కాపాడుతూ, జూదం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, ఎలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారమైనా వెంటనే తెలియజేయాలని కోరారు.