తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

టంగుటూరు గ్రామంలోని న్యూలైఫ్ ప్రార్థన మందిరంలో ఈస్టర్ ప్రత్యేక ఆరాధన అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. న్యూలైఫ్ సామాజిక–ఆధ్యాత్మిక పరిచర్యల ప్రతినిధి మరియు న్యూలైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగింది.
ఈ సందర్భంగా యేసుక్రీస్తు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని సుదర్శన్ బాబు ఘాటుగా పేర్కొంటూ, ప్రేమ, త్యాగం, సేవ అనే దివ్య సందేశాలను ప్రజలకు తెలియజేశారు. సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడమే నిజమైన విశ్వాసమని ఆయన స్పష్టం చేశారు.
న్యూలైఫ్ గీతాలాపన బృందం ఆత్మను హత్తుకునేలా ఆధ్యాత్మిక గీతాలు ఆలపించగా, వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. పరిచారకుల బృందం వందలాది మందికి సహవాస భోజనం ఏర్పాటు చేసి సేవాభావాన్ని ప్రతిష్టాత్మకంగా చాటిచెప్పింది.
అలాగే న్యూలైఫ్ కారుణ్య పరిచర్యల విస్తరణలో భాగంగా వితంతువులు, వయోవృద్ధులు, వికలాంగులు, అనాథలు, దీర్ఘకాలిక రోగులకు నెలవారీ ఆర్థిక సహాయం అందించే మహత్తర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సహాయాన్ని ఎస్తేర్ ప్రభుదాసు అందించారు.
అదనంగా న్యూలైఫ్ కారుణ్య పరిచర్య బృందం సభ్యులు టంగుటూరు గ్రామంలో అనాధలు, యాచకులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ దైవసేవకురాలు ఎస్తేర్ ప్రభుదాస్, దైవసేవకురాలు అమృత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. న్యూలైఫ్ పరిచర్యల సేవా కార్యక్రమాలు ప్రతి నెల కొనసాగుతూ సమాజంలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *