తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు, గిద్దలూరు టౌన్ పోలీస్ బృందం అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో గిద్దలూరు పట్టణంలో అనుమానాస్పదంగా సాగుతున్న అక్రమ జూద స్థావరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. దాడి సందర్భంగా అక్కడ జూదంలో పాల్గొంటున్న 6 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.దాడి సమయంలో నిందితుల వద్ద నుండి
₹1,35,000/- నగదు
ప్లేయింగ్ కార్డులు మరియు ఇతర జూద సామగ్రి
స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీసే ప్రమాదకర కార్యకలాపమని పోలీసులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అనైతిక, అక్రమ కార్యకలాపాలపై పటిష్ట చర్యలు కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులతో సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *