తొలి శుభోదయం ప్రకాశం:-
జైల్లో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములు అడిగి తెలుసుకున్నారు .చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ,మార్పు రావడం కోసం జైలులో ఉంచుతారని, జైలు జీవితమును అనుభవించిన తర్వాత మంచి పౌరులుగా మారి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును త్రాగుడు మొదలగు వ్యసనాలకు ఖర్చు చేసి, ఒంటిని మరియు ఇంటిని గుల్ల చేసుకోవద్దన్నారు. మద్యం త్రాగి మోటార్ వాహనములను నడిపితే చట్టరీత్యా నేరమన్నారు. అరెస్టు , బెయిల్,షూరిటీలు మరియు ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు.జైల్ లో అందుకున్న సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఖైదీలకు ఆహారంను అందించటానికై సప్లై చేసిన బియ్యము మరియు సరుకుల నాణ్యతను పరిశీలించారు. జైలు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరెండేంట్ యూ. లింగారెడ్డి ,లీగల్ ఎయిడ్ న్యాయవాది ఎన్.అహల్య, పారా లీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు,కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది, విచారణలో ఉన్న ఖైదీలు పాల్గొన్నారు.
