పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలన….. నమోదైన కేసులపై ఆరా
వృత్తి నైపుణ్యత, సాంకేతికత జోడించి ఇంకా మెరుగైన పోలిసింగ్ చేయాలన్న జిల్లా ఎస్పీ
ట్రాఫిక్ నివారణ,రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
చట్ట వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలి
క్రికెట్ బెట్టింగ్ లపై ప్రత్యేకంగా నిఘా
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా, గిద్దలూరు రూరల్ సర్కిల్ కార్యాలయం, గిద్దలూరు, కొమ్మరోలు పోలీస్ స్టేషన్ లను, మంగళవారం జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి గురించి, ఎక్కువగా జరిగే నేరాలపై అధికారులను ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణ,దొంగతనాల కట్టడి, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని, పాత నేరస్ధులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పాత పెండింగ్ కేసులు పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ గారు పలు సూచనలు చేసారు. స్టేషన్లో నిర్వహించే రికార్డ్స్ పెండింగ్ లేకుండా సక్రమంగా నిర్వహించాలని, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు మరియు ప్రాపర్టీని కోర్టు అనుమతితో డిస్పోసల్ చెయ్యాలని ఆదేశించారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేయాలని, ప్రైవేటు బస్సుల్లో సేఫ్టీ మెజర్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.కొత్త చట్టాల ప్రకారం ఎప్పటికప్పుడు వెబ్ అప్లికేషన్స్ అప్‌డేట్ లో ఉంచుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గ్యాంబ్లింగ్ తదితర నేరాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటు ను మరింత తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సిఐ మల్లికార్జున రావు, కొమ్మరోలు ఎస్సై నాగరాజు మరియు సిబ్బంది ఉన్నారు.