తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

గిద్దలూరు పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. కొమరోలు సమీపంలోని అమరావతి–కడప జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వాహనాలను గిద్దలూరు నుంచి కడప వైపు కు మళ్లిస్తున్నారు.ఈ మార్పుల వల్ల గిద్దలూరు పట్టణంలో భారీ వాహనాలు, లారీలు ఎక్కువగా సంచరించడం జరుగుతోంది… దీనితో ట్రాఫిక్ రద్దీ ఏర్పడగా, పట్టణ ఎస్సై ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
ఈ సందర్భంగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *