తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
స్థానిక మూలగుంటపాడు కు చెందిన గుండాల సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుండాల లక్ష్మీనారాయణ రెడ్డి సింగరాయకొండలో ఐదు ప్రముఖ ప్రదేశాలకు సుమారు రూ.50 వేల విలువ చేసే వాటర్ కూలింగ్ ఫ్రీజ్లను బహుకరించారు. ప్రజలకు వేసవికాలంలో తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరాయకొండలోని బార్ అసోసియేషన్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాయిబాబా దేవాలయం, బాలికల ఉన్నత పాఠశాల మరియు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద వాటర్ కూలింగ్ ఫ్రీజ్లను ఏర్పాటు చేసి అందజేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ ఎస్ఐ బి. మహేంద్ర, సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, రాయి రమేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు గుండాల కుటుంబ సభ్యులను అభినందిస్తూ, సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.
